చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణంలో... అక్రమంగా తుపాకీలు, బుల్లెట్లు రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదుంకు చెందిన బాబా ఫరూఖ్ అలియాస్ ఫయాజ్ వద్ద 2 రివాల్వర్లు, 29 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బాబా ఫరూఖ్.... కువైట్‌లో ఉంటున్న ఆయన సోదరుని సూచన మేరకు వాటిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. బెంగళూరులోని స్నేహితుని ఇంట్లో దాచిపెట్టేందుకు ముంబై నుంచి వస్తున్న ఫయాజ్‌ను.... మదనపల్లె శివారులోని వేంపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, దీని వెనుక ఎవరి హస్తముందో తేలుస్తామని పోలీసులు చెప్పారు.
తుపాకీలు, బుల్లెట్లు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - Chittoor District Crime News
అక్రమంగా తుపాకీలు, బుల్లెట్లు రవాణా చేస్తున్న వ్యక్తిని చిత్తూరు జిల్లా మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 29 బులెట్లు, రెండు రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అతనిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
అక్రమంగా తుపాకీలు, బుల్లెట్లు రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్