ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊసరపెంట పరువు హత్య కేసులో నిందితులు అరెస్టు - కూలాంతర వివాహం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంట వద్ద జరిగిన పరువు హత్య నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు.

defamaiton_killed_accusers_arrest_by_palamaneru_police

By

Published : Jul 1, 2019, 2:15 PM IST

పరువు హత్య:నిందితులు అరెస్టు

చిత్తూరు జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పలమనేరు మండలం ఉసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందని ఓ మహిళను కన్నతల్లిదండ్రులే పట్టపగలు కిరాతకంగా హత్య చేశారు. జూన్ 28న జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం నిందితులు పరారయ్యారు. నల్గాంపల్లె వద్ద నిందితుల ఆచూకీ కనుగొన్న పోలీసులు వారిని అరెస్ట్​ చేశారు. మృతురాలి తల్లిదండ్రులు, సోదరులు, సోదరితో పాటు తాత అరెస్టైన వారిలో ఉన్నారు. వారిపై కిడ్నాప్, హత్య, ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ యుగంధర్ బాబు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details