దివ్యాంగులకు ధ్రువప్రత్రాల జారీలో తలెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలని.. చిత్తూరు జిల్లా మదనపల్లెలో బధిరులు ఆందోళన నిర్వహించారు. మదనపల్లె డివిజన్ మూగ చెవిటి సంఘం ఆధ్వర్యంలో ప్రాంతీయ ఆసుపత్రి ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
అర్హులైన చాలామందికి ధ్రువప్రత్రాలు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ.. సైగల ద్వారా నిరసన చేపట్టారు. కొన్ని ధ్రువప్రత్రాలలో పేర్లు తప్పు ఉండడం వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వాటిని వెంటనే సరి చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.