భార్య, భర్తల మధ్య చిన్నపాటి గొడవలు.. ఆ అత్తమామను బయటకు గెంటేసి ఇంటికి తాళాలు వేసేలా చేశాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం.. బి. కొంగరవారి పల్లిలో జరిగింది. అబ్బూరి ప్రభాకర్, మునెమ్మ దంపతులకు.. ముగ్గురు సంతానం కాగా అందులో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడిని ఉన్నత చదువులు చదివించి, పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం దుబాయ్‌కి పంపించారు. ఐదేళ్లు అక్కడ ఉద్యోగం చేసిన చిరంజీవి.. భార్య కల్పనతో ఏర్పడిన చిన్నపాటి గొడవలతో స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత తనకు భర్త చిరంజీవితో అన్యాయం జరిగిందని.. కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తల్లిదండ్రులు, కుమారుడు.. బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం చిరంజీవి దుబాయ్‌కి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఈ నెల 14న ఇంటికి వచ్చిన కోడలు కల్పన.. తమని ఇంటి నుంచి బయటకు నెట్టి తాళాలు వేసుకొని వెళ్లిందని.. అత్తమామలు బోరున విలపించారు. తాము ఎటూ వెళ్లలేక.. ఇంటి బయటనే ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భర్తతో గొడవ... అత్త మామలను గెంటేసి ఇంటికి తాళాలు వేసిన కోడలు - daughter in law locks house updates
భార్య, భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అత్తమామలను ఇంటి నుంచి బయటకు గెంటేసి.. తాళాలు వేసిందో కోడలు. 15 రోజులుగా ఇంటి బయటే ఉన్నామంటూ అత్తమామలు విలపిస్తున్నారు.
అత్త మామలను గెంటేసి ఇంటికి తాళాలు వేసిన కోడలు