ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం - ttd board members

Dasari Kiran Oath: తిరుమలలోని రంగనాయకుల మండపంలో తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా దాసరి కిరణ్​ కుమార్​ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు.. వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చారు.

Dasari Kiran Kumar
దాసరి కిరణ్ కుమార్

By

Published : Dec 19, 2022, 3:36 PM IST

Dasari Kiran kumar Oath: తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ కుమార్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం మీడియాతో దాసరి కిరణ్​ కుమార్​

"నన్ను నమ్మి సీఎం జగన్ మోహన్​ రెడ్డి ఈ అవకాశం ఇచ్చారు. స్వామి వారి సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు.. ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేను". - దాసరి కిరణ్ కుమార్, తితిదే బోర్డు సభ్యుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details