చిత్తూరు జిల్లా నగరవనం ఆవరణంలో అధికారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఫిట్ ఇండియా-2020లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 20నుంచి 30నిమిషాల పాటు వ్యాయామం చేయాలని జిల్లా పాలనాధికారి నారాయణ భరత్ గుప్తా అన్నారు. డీఎస్ఏ స్టేడియం నుంచి పీవీకెఎన్ కళాశాల, గ్రీమ్స్ పేట సర్కిల్, దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ జంక్షన్, పీసీఆర్ సర్కిల్, మీదుగా సైకిల్ ర్యాలీ సాగింది.
'ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం తప్పనిసరి' - చిత్తూరు వార్తలు
ఫిట్ ఇండియా-2020లో భాగంగా చిత్తూరు జిల్లా నగరవనం వద్ద అధికారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయాలని సూచించారు.
ఉండటానికి వ్యాయామం తప్పనిసరి