చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో రెండు రోజులుగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. రాత్రిళ్లు పొలాల వైపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దేవలకుప్పం, బయరెడ్డిపల్లె, రామకృష్ణారెడ్డి కాలనీ గ్రామాల పరిధిలో రైతులు ఏనుగుల దాటికి తీవ్రంగా నష్టపోతున్నారు. రెవెన్యూ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి... అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఏనుగులను తమ గ్రామాల వైపు రాకుండా చేసి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.
సోమల మండలంలో ఏనుగులు హల్ చల్
చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. రాత్రిళ్లు పొలాల వైపు సంచరిస్తూ పలు గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. వాటిని తమ గ్రామాల వైపు రాకుండా చేసి తమ పంటలను కాపాడాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.
ధ్వంసమైన పంట
Last Updated : Dec 17, 2020, 1:26 PM IST