చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తంబళ్లపల్లి మండలం అన్నగారిపల్లిలో విద్యుదాఘాతంతో రైతు సునీల్ కుమార్ రెడ్డికి చెందిన 20 మేకలు మృతి చెందాయి. వీటి విలువ రూ.3 లక్షలకు పైగా ఉందని, తీవ్రంగా నష్టపోయామని రైతు ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామం కొత్తపల్లెకు చెందిన వేరుశనగ పంట నీట మునిగింది. పొలాల్లోకి వంకలు రావడంతో వేరుశనగ నూర్పిడి చేసి ఉంచిన కాయలు, గ్రాసం పనికి రాకుండాపోయాయి. పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం అంతటా రైతులు భారీ వర్షాలతో నష్టపోయారు. లోతట్టు ప్రాంతాల్లోని వేరుశనగ పొలాల్లో నీరు చేరి చెట్లు కుళ్ళిపోయాయి. నూర్పిడి చేసి పొలాల్లో ఉంచిన వాదులు దెబ్బతిన్నాయి.
భారీ వర్షాలతో నీట మునిగిన వేరుశనగ.. ఆందోళనలో రైతులు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. కర్ణాటక నుంచి ప్రవహించి తంబళ్లపల్లె మీదుగా.. కడప జిల్లా గాలివీడు, వెలిగల్లు రిజర్వాయర్‌కు చేరే పెద్ద నది పెద్దేరు జోరుగా ప్రవహిస్తోంది. ఈ నదిపై 1974లో నిర్మించిన పెద్దేరు రిజర్వాయర్ నిండి పొంగుతోంది.
crop damage