అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పీఎల్. నరసింహులు తెలిపారు. 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయినట్లు నేతలతో రైతులు వెల్లడించారు. పెట్టుబడి 10 శాతం కూడా రావడం లేదని, ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం చెల్లిస్తేనే రైతులకు పెట్టుబడి దక్కుతుందని మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
'వేరుశనగ రైతులకు 25 వేల పరిహారం అందివ్వాలి' - పంట నష్టంపై చిత్తూరు రైతుల ఆందోళన వార్తలు
అతివృష్టి కారణంగా నష్టపోయిన వేరుశనగ పంట రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చిత్తూరు జిల్లా ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పీఎల్.నరసింహులు, సీపీఐ తంబళ్లపల్లె నియోజకవర్గం కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ములకలచెరువు మండలం లోని పెద్దపాలెం గ్రామంలో వేరుశనగ పొలాల వద్దకు వెళ్లి రైతులతో వారు మాట్లాడారు.
!['వేరుశనగ రైతులకు 25 వేల పరిహారం అందివ్వాలి' 'వేరుశనగ రైతులకు 25 వేల పరిహారం అందివ్వాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9225194-241-9225194-1603039706108.jpg)
'వేరుశనగ రైతులకు 25 వేల పరిహారం అందివ్వాలి'