ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు ప్రమాదం: మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు - karnool fatal accident latestnews

కర్నూలు జిల్లాలో 14 మందిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం మృతదేహాల.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల స్వస్థలమైన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో 7 మృతదేహాల ఖననానికి ఏర్పాట్లు చేశారు. బి.కొత్తకోట మండలం సర్కారుతోపులో 4 మృతదేహాలను.. మదనపల్లెలో 3 మృతదేహాలను ఖననం చేయనున్నారు.

cremation for kurnool accident dead bodies at nelore
cremation for kurnool accident dead bodies at nelore

By

Published : Feb 15, 2021, 11:12 AM IST

కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతుల స్వస్థలమైన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో 7 మృతదేహాల ఖననానికి ఏర్పాట్లు చేశారు. బి.కొత్తకోట మండలం సర్కారుతోపులో 4 మృతదేహాలను.. మదనపల్లెలో 3 మృతదేహాలను ఖననం చేయనున్నారు. పెను విషాద ఘటనను బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమతో కలివిడిగా తిరిగిన కుటుంబం తుడిచిపెట్టుకుపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదంలో ప్రాణాలతో మిగిలిన నలుగురు చిన్నారులకు.. కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.

మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు

మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పగా.. నేడు వారే నేరుగా వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..

ABOUT THE AUTHOR

...view details