చిత్తూరు జిల్లా మదనపల్లెలో హత్యకు గురైన అక్కాచెల్లెళ్లకు పోలీసులు శవపరీక్ష నిర్వహించారు. నివేదిక వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో.. అంత్యక్రియల నిర్వహణకు అవకాశమిచ్చారు. అంతిమ సంస్కారాలకు తండ్రి పురుషోత్తం అభ్యర్థన మేరకు అనుమతిచ్చారు. పోలీసు భద్రత నడుమ శ్మశానానికి వచ్చిన ఆయన.. కర్మకాండ చేస్తూనే గుండెలవిసేలా విలపించారు. చూస్తుండగానే దారుణం జరిగిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
మదనపల్లిలో హత్యకు గురైన అక్కాచెల్లెళ్లకు అంత్యక్రియలు పూర్తి - మదనపల్లిలో హత్యకు గురైన అక్కాచెల్లెళ్లకు అంత్యక్రియలు వార్తలు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో హత్యకు గురైన అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలు పోలీసులు భద్రత నడుమ ముగిశాయి. యువతుల తండ్రి పురుషోత్తం కోరిక మేరకు పోలీసు భద్రత నడుమ ఆయనను శ్మశానానికి తీసుకెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. విగతజీవులుగా పడివున్న తన పిల్లలను చూసి ఆ తండ్రి గుండెలు పగిలేలా విలపించాడు.
చిన్నకుమార్తెను పెద్దకుమార్తె అలేఖ్యే హతమార్చిందని.. ఆ తర్వాత తననూ చంపాలని అలేఖ్య తల్లిని కోరిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలపారు. ఈ ఘటనను అక్కడి స్థానికులు, సహోద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులిద్దరూ విద్యార్థులనూ ప్రోత్సహిస్తూ మంచిమాటలు చెప్పేవారని, దైవభక్తి ఎక్కువగా ఉండటంతో తరచూ తీర్థయాత్రలకు వెళ్తుండేవారని తెలిపారు. కొద్ది రోజులుగా పురుషోత్తం తన కుమార్తెల విషయంలో మానసిక వేదన అనుభవిస్తున్నట్లుగా వారు చెప్పారు.