తిరుపతి బైరాగి పట్టెడలోని ఎంకె నాయుడు కాలనీలో గంగమ్మ తల్లి డైరీ ఫాం పేరుతో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆరు ఎకరాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. హథీరాంజీ మఠానికి చెందిన భూములని పేర్కొంటూ తమకు లీజుకు ఇచ్చారని.. అక్కడ డైరీఫాం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ భూమిని పేదల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఆర్డీవో కనకనరసారెడ్డికి వినతిపత్రం అందించారు.
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారంటూ.. సీపీఎం ఆందోళన - tirupathi cpm protest news
తిరుపతిలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ.. సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సర్కారు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఆర్టీవోకు వినతిపత్రం సమర్పించారు.
Breaking News