రజనీకాంత్, పవన్ కల్యాణ్ సహా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ప్రజాదరణ పొందే రోజులు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... వ్యవసాయ బిల్లులను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తోందన్న నారాయణ... సెంటు భూమిలో పేదలు ఎలా ఇళ్లు నిర్మించుకుంటారని ప్రశ్నించారు.
'సినీ పరిశ్రమ నుంచి వచ్చేవారు రాజకీయాల్లో ప్రజాదరణ పొందలేరు' - news updates in thirupathi
సినీ పరిశ్రమ నుంచి వచ్చేవారు రాజకీయాల్లో ప్రజాదరణ పొందే రోజులు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెంటు భూమిలో ప్రజలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నించారు. బిగ్బాస్ షోలో మహిళలను కించపరిచేలా నాగార్జున మాట్లాడారని, ఈ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
బిగ్ బాస్ షోలో మహిళలను కించపరిచేలా నాగార్జున ప్రవర్తించారన్న సీపీఐ జాతీయ కార్యదర్శి... దీనిపై కేసు పెట్టేందుకు ప్రయత్నించినా స్థానిక పోలీస్ స్టేషన్, న్యాయస్థానాల్లో తీసుకోలేదన్నారు. ఈ అంశంపై వచ్చే రెండు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.
ఇదీచదవండి.