భూబకాసురులు నిరుపేదల భూములను సైతం వదిలిపెట్టడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని సీతమ్మ నగర్ భూములను ఆయన పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా సీతమ్మ నగర్లో నివాసముంటున్న పేదలను ఖాళీ చేయించడానికి అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికే సీతమ్మనగర్ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం... సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి పేదలను ఖాళీ చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
Narayana: 'దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికే అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలి'
తిరుపతిలోని సీతమ్మ నగర్ భూములను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI national secretary Narayana) పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా సీతమ్మ నగర్లో నివాసముంటున్న పేదలను ఖాళీ చేయించడానికి అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికే అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారయణ