CPI Narayana on Jagan: వైసీపీ నేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామాలలో ఖాళీ స్థలాలు కనిపిస్తే వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల నిర్వాకంతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయని పేర్కొన్నారు. వైసీపీకి ఎంత మంది సలహాదారులు ఉన్నారో వారి ఫోటోలను విడుదల చేయాలన్నారు. మాచర్లలో తెదేపా కార్యాలయంపై దాడిని నారాయణ ఖండించారు. ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రుం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 175 స్థానాలు వస్తాయని జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ పగటి కలలు కంటున్నారు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ - tirupati news
CPI Narayana on Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గిట్టనివారిపై వైసీపీ దాడులు నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. 175 స్థానాలంటూ, జగన్ పగటి కలలు కంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.
మీడియా సమావేశంలో నారాయణ
"వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామాలలో ఖాళీ స్థలాలు కనిపిస్తే వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. 175 స్థానాలు వస్తాయని జగన్ కలలు కంటున్నారు. ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. వైసీపీకి ఎంత మంది సలహాదారులు ఉన్నారో వారి ఫోటోలను విడుదల చేయాలి" - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఇవీ చదవండి: