సీపీఐ నేతల ఆరెస్ట్లపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమన్న ఆయన పోలవరం సందర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని తిరుపతిలో ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వామపక్షాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తిరుపతి ఉపఎన్నికలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
'పోలవరం సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి?'
ప్రభుత్వం తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పోలవరం సందర్శించేందుకు బయలుదేరిన సీపీఐ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేయడాన్ని తప్పుబట్టారు. ప్రాజెక్టు సందర్శనకు వామపక్షాలకు అనుమతి ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ