ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం వద్దు: నారాయణ - తిరుపతిలో కోవిడ్ 19 హెల్ప్ డెస్క్

కరోనాను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తిరుపతి బైరాగపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 హెల్ప్ డెస్క్​ను ఆయన ప్రారంభించారు. ఆనందయ్య మందుపై దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

cpi
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

By

Published : May 24, 2021, 4:00 PM IST

కరోనాను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి బైరాగపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 హెల్ప్ డెస్క్​ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాల వల్లే వైద్యులకు చెడ్డపేరు వస్తోందని అన్నారు.

ఆనందయ్య మందుపై దుష్ప్రచారం తగదని వెల్లడించారు. ఆ ఔషధంపై ప్రజల్లో నమ్మకం పెరిగినప్పుడు.. దానిపై పరిశోధనలు చేయించి రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

ఇదీ చూడండి.
ఎల్లో ఫంగస్ వ్యాప్తి..​ యూపీ​లో తొలి కేసు

ABOUT THE AUTHOR

...view details