ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాదక ద్రవ్యాల సరఫరాలో ఏపీ ప్రభుత్వ పాత్ర: నారాయణ - చిత్తూరు జిల్లా వార్తలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి జగన్​పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కమీషన్లు నేరుగా సీఎం కార్యాలయానికి వెళుతున్నాయని.. మాదక ద్రవ్యాల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉందని అన్నారు.

సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ

By

Published : Oct 14, 2021, 10:55 PM IST

రాష్ట్ర భవిష్యత్​ ఆదాయాన్ని సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో ఆరోపించారు. ఇసుక అవినీతి సొమ్ము ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరుతోందని అన్నారు. ప్రతి కాంట్రాక్టుకు 5 శాతం కమీషన్ సీఎం కార్యాలయానికి చేరుతోందని.. కమీషన్లు తీసుకుంటున్న తీరును ఆధారాలతో నిరూపిస్తామన్నారు.

తిరుపతిలో వైసీపీ నేతల భూ కబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. భూ కబ్జాకు పాల్పడే అధికార పార్టీ నేతలకు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని.. వారందరూ ఖచ్చితంగా జైలుకు వెళ్లక తప్పదన్నారు. దేశంలో మాదకద్రవ్యాల సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందని.. అందులో ఏపీ ప్రభుత్వ పాత్ర ఉందని అన్నారు. కేంద్రం కనుసన్నల్లో సీఎం జగన్ పనిచేస్తూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యం, స్వార్థంతో విద్యుత్ సంక్షోభం వచ్చిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details