ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 7, 2022, 9:23 PM IST

ETV Bharat / state

CPI Narayana: వనమా రాఘవను కొత్తగూడెం వీధుల్లో శిక్షించాలి: నారాయణ

CPI Narayana Comments On Vanama Raghava: వ్యాపారి కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెరాస ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర రావును కొత్తగూడెం నగర వీధుల్లో శిక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అధికార మదంతోనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

వనమా రాఘవను కొత్తగూడెం వీధుల్లో శిక్షించాలి
వనమా రాఘవను కొత్తగూడెం వీధుల్లో శిక్షించాలి

CPI Narayana Comments On Vanama Raghava: తెలంగాణ పాల్వంచలోని వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో వనమా రాఘవేంద్ర రావు పశువులా ప్రవర్తించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. రామకృష్ణ ఇచ్చిన వాంగ్మూలం కోర్టు కూడా నమ్ముతుందని ఆయన తెలిపారు. ఇది కిరాతకమైన హత్య అని... ఏటువంటి సాక్ష్యాలు అవసరం లేదన్నారు. రాఘవను అరెస్ట్ చేయకుండా కొత్తగూడెం నగర వీధుల్లో శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార మదంతోనే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో తెరాస ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో అతని సెల్ఫీ వీడియో సంచలనమైంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.

సెల్పీ వీడియోలో రామకృష్ణ ఏమన్నారంటే..

‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్‌ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు' అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.

ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు సత్వరం నిందితుల్ని అరెస్టు చేయాలని తెలంగాణలోని వివిధ పార్టీల నాయకులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడానికి కారణమైన వారిని ఉపేక్షిస్తే ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని తక్షణమే శిక్షించాలని కోరుతున్నారు. రాఘవేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లగా.. అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి

Vanama Raghavendra Rao: ఎమ్మెల్యే తనయుడు.. వివాదాల రాఘవుడు.. అతడో కాలకేయుడు..

ABOUT THE AUTHOR

...view details