రుయా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం శవ రాజకీయాలు చేయటం మానుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధరణ కమిటీ రుయా ఆసుపత్రిని సందర్శించకుండానే.. పరిహారం ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో మరణాల సంఖ్యపై ఇప్పటికి స్పష్టత లేకుండా పోయిందన్నారు. ఆస్పత్రిలో 11 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా.. ప్రతిపక్ష పార్టీలు భిన్న వాదనను వినిపిస్తున్నాయన్నారు.
'రుయా' ఘటనపై శవ రాజకీయాలు మానుకోవాలి: సీపీఐ నారాయణ - రుయా ఆసుపత్రి ఘటన
రుయా ఘటనపై ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రభుత్వం నియమించిన నిజనిర్ధరణ కమిటీ ఆసుపత్రిని సందర్శించకుండానే..పరిహారం ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.
'రుయా' ఘటనపై శవ రాజకీయాలు మానుకోవాలి
చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. పరిహారం డబ్బులు నిజంగా బాధితులకు అందుతాయా ? లేదా ? అనేది సందేహంగా ఉందన్నారు.
ఇదీచదవండి: అంబులెన్సుల అడ్డగింత: తెలంగాణ, ఏపీ, కేంద్రానికి టీఎస్ హైకోర్టు నోటీసులు