ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా, వైకాపాకు సీపీఐ నేత నారాయణ సవాల్ - తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో సీపీఐ నారాయణ

వైకాపా, తెదేపాలకు ప్రత్యేక హోదా సాధించాలని ఉంటే...అఖిలపక్షంగా దిల్లీ వెళ్లి పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు.

CPI NARAYANA
CPI NARAYANA

By

Published : Apr 11, 2021, 10:41 PM IST

తెదేపా, వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతారే కానీ పదవులను వదలరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. తిరుపతి లోక్​సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఎం ఎంపీ అభ్యర్థి నెల్లూరు యాదగిరికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలో పాగా వేసేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు. భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ అవినీతిపరురాలన్న నారాయణ.. ఆమె ఏనాడు దళితుల హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొనలేదన్నారు. నిజంగా ప్రత్యేక హోదా సాధించాలని వైకాపా, తెదేపాలకు ఉంటే..అఖిలపక్షంగా దిల్లీ వెళ్లి పోరాడేందుకు ముందుకు రావాలని నారాయణ సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details