ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cow thieves Arrest : ఏడాదిగా పశువులు మిస్సింగ్​.. - తమిళనాడు సరిహద్దు వార్తలు

నగరి మండలంలో ఏడాాది కాలంగా పశువుల మిస్సింగ్​ కేసుని పోలీసులు ఛేదించారు. గుట్టు చప్పుడు కాకుండా పశువులను చోరీ చేస్తున్న గ్యాంగ్​ను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Cow thieves Arrest
ఏడాదిగా కనిపించకుండాపోతున్న పశువులు...ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన దొంగలు

By

Published : Oct 3, 2021, 1:36 PM IST

ఏడాది కాలంగా నగరి మండలంలోని గ్రామాల్లో దాదాపు 40 పశువులు మిస్సింగ్​ అయ్యాయి. ఆందోళన చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ లో అనేక కేసులు నమోదైన దొంగలు మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు పశువుల దొంగలపై దృష్టి పెట్టారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పొద్దుటూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి పశువుల దొంగతనమే జరిగినట్లు సమాచారం తెలుసుకున్న నగరి పోలీసులు.. తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రెక్కీ నిర్వహించి పూర్వం నగిరి మండలంలోని పుణ్యంలో నివసిస్తున్న సాయి కుమార్(22)ని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

నగరి మండల పరిధిలో 18 ఆవులను, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో 22 ఆవులను దొంగిలించినట్లు నిందితుడు తెలిపాడు. దొంగిలించిన ఆవులలో కొన్నింటిని తిరుత్తని తాలూకా వేలంజేరి గ్రామానికి చెందిన రాజా (51)కు అమ్మినట్లు, మిగతా వాటిని కసాయి దుకాణాలకు అమ్మినట్లు అంగీకరించాడు.

రాజాని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్​లో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో వారిద్దరి మీద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు నగరి సీఐ మద్దయ్యచారి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల 75 వేల రూపాయలను, నాలుగు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్​లో సీఐ మధ్ధయ్యచారితో పాటు ఎస్ఐ నరేష్, క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గవాస్కర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి : రౌడీషీటర్‌ హత్యకు రూ.30 లక్షల సుపారీ

ABOUT THE AUTHOR

...view details