ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విరాళాలు లేకుండా... గోసంరక్షణే ధ్యేయంగా..! - చిత్తూరు జిల్లా

గోవుల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు హైదరాబాద్​కు చెందిన సంఘ సేవకుడు. విరాళాలు ఆశించకుండా తన కష్టార్జితంతో సంపాదించిన సొమ్మును.. గోవుల బాగోగులకు వినియోగిస్తున్నాడు.

విరాళాలు లేకుండా...గోసంరక్షణే ధ్యేయంగా..!

By

Published : May 8, 2019, 11:03 AM IST

విరాళాలు లేకుండా...గోసంరక్షణే ధ్యేయంగా..!

కరవులో రైతన్నలకు భారంగా మారిన స్వదేశీ జాతి రకం పశువులను సంరక్షించేందుకు.. హైదరాబాద్​కు చెందిన ఓ సంఘసేవకుడు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాడు. సంపాదనలో కొంత భాగాన్ని గోవుల సంరక్షణ కోసం ఖర్చు చేస్తూ రైతన్నలకు ఉపశమనం కలిగిస్తున్నారు.

స్వేచ్ఛగా జీవిస్తున్న 200పైగా గోవులు...

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కన్య మడుగు సమీపంలోని శ్రీ కనకాలమ్మ పుణ్యక్షేత్రం వద్ద హైదరాబాద్​కు చెందిన సంఘ సేవకుడు, విద్యావేత్త దాత జయరామన్ రెండు సంవత్సరాల క్రితం గోశాలను ప్రారంభించారు. ఇక్కడ 200కి పైగా ఆవులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. వీటికి అవసరమైన షెడ్లు, గ్రాసం, తాగునీరు, వైద్య సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు.

గో సంరక్షణ, పునరుత్పత్తే లక్ష్యం....

కరవు ప్రభావంతో పడమటి మండలాల్లో తీవ్రమైన పశుగ్రాసం కొరతను పశువులు ఎదుర్కొంటున్నాయి. వ్యాధులు ప్రబలి అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. దేశంలోని వివిధ జాతుల స్వదేశీ రకం పశువుల సంరక్షణ, పునరుత్పత్తే లక్ష్యంగా గోశాల నిర్వహణ చేపట్టామని నిర్వాహకుడు జయరామన్ తెలిపారు.

గోమలంతో ఎరువులు, మందులు...

గో మూత్రం తో సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారక మందులు తయారు చేస్తూ.. విష ప్రభావం లేని నాణ్యమైన దిగుబడులను 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాధిస్తున్నారు.ఈ విధానాన్ని పడమటి మండలాల రైతులకు తెలియజేస్తూ ఆచరించేలా చూస్తున్నారు. శ్రీ కనకాలమ్మ అమ్మవారి పుణ్యస్థలాన్ని సైతం అన్ని విధాలా అభివృద్ధి చేసేలా జయరామన్ కృషి చేస్తున్నారు.

అభినందనీయం...

గోసంరక్షణశాల వలన తమకు ఎంతో ఊరట కలిగిందని ఇక్కడ పనులు నిర్వహిస్తున్న కూలీలు, ఈ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. మూగ జీవాలను ఆదుకోవాలన్న ఆయన సంకల్పం అభినందనీయమని కొనియాడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details