ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 29 నుంచి చంద్రగిరిలో కొవిడ్ ఆంక్షలు: ఎమ్మెల్యే చెవిరెడ్డి - చంద్రగిరిలో కొవిడ్ ఆంక్షలు

ఈనెల 29 నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొవిడ్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి తెలిపారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతినివ్వనున్నట్లు స్పష్టం చేశారు.

covid restrictions at chandragiri
ఈనెల 29 నుంచి చంద్రగిరిలో కొవిడ్ ఆంక్షలు

By

Published : Apr 27, 2021, 6:49 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొవిడ్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి ఉదయం 6 నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతినిస్తామన్నారు. నియోజకవర్గంలో 5 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు, 150 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రగిరి ప్రాంతీయ ఆసుపత్రిలో 100, నారావారిపల్లి సీహెచ్​సీలో 50 ఆక్సిజన్ పడకలు ఏర్పాటుకు రూ. 25 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రగిరి ప్రాంతీయ ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయన్నారు.

ఇదీచదవండి: ఆక్సిజన్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు.. ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details