ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల్లో ధైర్యం నింపాలి.. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందాలి' - chandragiri mla chevireddy meet with medical officers for kovid patients treatment news

కరోనా విపత్కర సమయంలో ప్రజల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తోన్న అన్ని ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. శ్రీ పద్మావతి నిలయంలో కరోనా బాధితులకు అందుతున్న సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

'కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి'
'కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి'

By

Published : Jul 19, 2020, 9:09 PM IST

Updated : Jul 19, 2020, 9:16 PM IST

ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్-19 తిరుపతి సమన్వయ కమిటీ సమావేశంలో వైద్యాధికారులతో సమావేశమైన ఆయన.. ప్రజలు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తోన్న అన్ని ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స అందించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో జిల్లా కలెక్టర్​ భరత్​ గుప్తా అధికారులను సమన్వయం చేసుకుంటూ.. వైరస్​ బాధితులకు అందిస్తోన్న సేవలను అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో కార్పొరేట్​ వైద్యం అందించడం ద్వారా బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులకు సూచించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

Last Updated : Jul 19, 2020, 9:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details