ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహకార సంఘంలో.. లెక్కలు లేని కోట్లకు రెక్కలొచ్చాయి - కలికిరి సహకార సంఘం

రైతులకు సేవలందించాల్సిన సహకార సంఘాలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. పంటల సాగుకు రుణాలు ఇస్తున్నా.. వాటి లెక్కల్లో గందరగోళం నెలకొంటోంది. చిత్తూరు జిల్లా కలికిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అక్రమాలు జరుగుతున్నా.. అంతా సవ్యంగా ఉన్నట్లు స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిస్తున్నారు.

kalikiri co operative society
కలికిరి సహకార సంఘం

By

Published : Oct 16, 2020, 11:05 PM IST

చిత్తూరు జిల్లా కలికిరి సహకార సంఘంలో రూ.1.02 కోట్లకు లెక్కలు లేవు. వాల్మీకిపురం డీసీసీబీ బ్యాంకు నుంచి రూ.2.78 కోట్ల రుణాలు తీసుకున్నట్లు నమోదు కాగా.. రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల కింద ఇచ్చింది రూ.1.76 కోట్లే. మిగిలిన నగదుకు ఎటువంటి రసీదులు లేవు. ఆరుగురు రైతులకు సంబంధించిన రూ.3,68,209లకు నగదు రసీదులు లేవని ఇటీవల రికార్డులు పరిశీలించిన అధికారులు తేల్చారు. మిగతా సొమ్ము సంగతి చూడకుండానే వెళ్లిపోయారు.

రుణం తీరినా.. రసీదులు లేవు:

రైతులు తీసుకున్న పంట, దీర్ఘకాలిక రుణాలను చెల్లించినట్లు లెడ్జర్‌ పుస్తకంలో నమోదు చేశారు. నగదు తీసుకున్నట్లు బ్యాంకు అధికారులు రసీదులు మాత్రం రాయలేదు. బ్యాంకులో కూడా ఆ సొమ్ము జమ కాలేదు. కొన్నేళ్లుగా ఇలా జరుగుతున్నా.. ఏ అధికారి పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏడాదికోసారి జరిగే ఆడిట్‌లోనూ అంతా సవ్యంగానే ఉన్నట్లు తేల్చి వెళ్తున్నారు. రుణాల వివరాలు నమోదు చేసే లెడ్జర్‌ పుస్తకంలో కొట్టివేతలు ఉన్నాయి.

రికార్డులు సక్రమంగా లేవు:

"రైతులు రుణం చెల్లించినట్లు లెడ్జర్‌ పుస్తకంలో చూపించి లోన్‌ కొట్టేశారు. వారి నుంచి నగదు తీసుకున్నట్లు రసీదు రాయలేదు.. బ్యాంకుకూ చెల్లించలేదు. బ్యాంకు సీఈవో కొండప్పను అడిగితే.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. రూ.1.02 కోట్లకు లెక్కలులేవు. 18 అద్దె గదులకు సంబంధించిన రికార్డులూ సక్రమంగా లేవు. డీసీసీబీ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి". - రెడ్డివారి వెంకటరెడ్డి, సింగిల్‌ విండో ఛైర్మన్‌, కలికిరి.

ఇదీ చదవండి:గ్రామ సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details