ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపుతోన్న కరోనా

శ్రీవారి దర్శనాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. దర్శనాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నప్పటికీ.. ఆ మేరకు భక్తులు రావడం లేదు. ఫలితంగా ప్రత్యేక ప్రవేశ, సర్వదర్శనాలు, విరామ సమయ దర్శానాల టికెట్లు భారీగా మిగిలిపోతున్నాయి.

corona virus Effect on thirumala balaji vision in thirumala chithore district
శ్రీవారి దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపుతోన్న కరోనా

By

Published : Jul 15, 2020, 5:38 PM IST

చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. తిరుమల శ్రీవారి దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్ అనంతరం దర్శనాలను తిరిగి ప్రారంభించిన తితిదే.. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తోంది. ప్రత్యేక ప్రవేశ, సర్వ దర్శనాలతో పాటు విరామ సమయ దర్శనాలతో కలిపి రోజుకు.. పన్నెండు వేల మందికి అవకాశం ఉన్నప్పటికీ, ఆ మేరకు భక్తులు రావడం లేదు.

ఆన్‌లైన్​లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు.. తిరుమల యాత్రను రద్దు చేసుకుంటుండగా.... తిరుపతిలో జారీ చేసే సర్వ దర్శన టికెట్లు మిగిలిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఏడు వేల మందికి మించి శ్రీవారి దర్శనాలకు రావడం లేదు. ఈ పరిస్థితులతో తిరుమల తిరుమాఢ వీధులు బోసిపోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details