తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొని.. 'పరిశుభ్రత పాటిద్దాం.. కరోనా వ్యాధిని తరిమికొడదాం' అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు మాట్లాడారు. జలుబు, దగ్గు వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. సకాలంలో వైద్యుని సంప్రదించాలని సూచించారు.
'పరిశుభ్రతను పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం' - రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ
'పరిశుభ్రంగా ఉంటే ఏ జబ్బులు దరిచేరవు. శుభ్రత ఆరోగ్యానికి అసలు రహస్యం. అందరూ ఆరోగ్యంగా ఉండండి.. కరోనాను దగ్గరకు రానివ్వకండి' అంటూ తిరుపతి రుయా ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
తిరుపతిలో ర్యాలీ నిర్వహిస్తున్న రుయా ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు