'కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలి.. అందుకే సకల ఏర్పాట్లు చేస్తున్నాం' కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రజలెవరూ భయపడవద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు కొవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు.
సౌకర్యాలపై ఆరా..
'కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలి.. అందుకే సకల ఏర్పాట్లు చేస్తున్నాం' ప్రారంభంలోనే పదుల సంఖ్యలో వేచి ఉన్న రోగులు ఓపీ తీసుకుని కొవిడ్ సెంటర్లో చేరిపోయారు. ఐదు అంతస్తులు, 33 గదులు, 250 బెడ్లు, సరిపడా వైద్య సిబ్బంది, కార్మికులను నియమించామన్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సిబ్బంది నియామకం, క్యాటరింగ్, ఇతర సదుపాయాల కల్పనపై ఆయన ఆరా తీశారు.
అధికారులకు దిశానిర్దేశం..
'కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలి.. అందుకే సకల ఏర్పాట్లు చేస్తున్నాం' కొవిడ్ సెంటర్లో పరిసరాలు, సౌకర్యాల కల్పనను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ కొవిడ్ కేంద్రంలో కొవిడ్ పేషెంట్లకు అవసరమైన మందులు, ఎక్స్ రే వంటివి అందుబాటులో ఉండాలన్నారు. వెంటనే ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రోగుల మానసిక ఉల్లాసానికి అవసరమైన ప్రణాళికలు సైతం రూపొందించాలన్నారు.
సకల ఏర్పాట్లు..
'కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలి.. అందుకే సకల ఏర్పాట్లు చేస్తున్నాం' ఇందుకోసం ఓ టీవీ ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు చిత్రాలను ప్రదర్శించాలన్నారు. మనో వికాసానికి దోహదం చేసే క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచాలని.. ఆధ్యాత్మిక, గొప్ప వ్యక్తుల చరిత్ర తదితర పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌తో వచ్చిన రోగులకు పోషక విలువలు కలిగిన పౌష్టిక ఆహారం చికెన్, చేపలు, రాగి సంకటి వంటి మెనూ అందించాలన్నారు. ఈ కేంద్రంలో అందించే సేవల ఫలితంగా రోగులు త్వరగా ఆరోగ్యవంతులై కోలుకుని ఇంటికెళ్లాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎంపీడీఓ రాధమ్మ, తహసీల్దార్లు భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి :నేడు సుప్రీంలో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ