ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెడ్​జోన్ నుంచి బయటపడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం'

రైతులు పండించిన పంటలకు రవాణా సౌకర్యాలు కల్పించటంతో పాటు...కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టిందేకు చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు.

Corona Taskforce Meet in tirupathi sv university
చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తాతో ముఖాముఖి

By

Published : May 2, 2020, 5:44 PM IST

చిత్తూరు జిల్లా అత్యధికంగా సాగవుతున్న మామిడి, టమోటా పంటలను మార్కెట్ చేసుకునే విధంగా రైతులకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకెళ్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారయణ్ భరత్ గుప్తా తెలిపారు. తిరుపతి ఎస్వీవిశ్వవిద్యాలయంలో కోవిడ్-19పై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించిన ఆయన....సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదువుతున్న శ్రీకాళహస్తిపై ప్రత్యేక దృష్టి సారించామన్న కలెక్టర్...వైరస్ వ్యాప్తిని నియంత్రించటం ద్వారా రెడ్ జోన్ నుంచి బయటకు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నామంటున్న కలెక్టర్ భరత్ గుప్తాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తాతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details