ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా అనుమానితులు

చిత్తూరు జిల్లాలో కరోనా అనుమానితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సోమవారం 1138 మంది ఉన్న అనుమానితులు.... మంగళవారం నాటికి 1467 కు చేరినట్లు కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. .ఒకరు డిశ్చార్జి అయ్యారు.

Corona suspects are growing throughout Chittoor district
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా అనుమానితులు

By

Published : Apr 15, 2020, 10:26 AM IST

రాష్ట్రంలోని కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. చిత్తూరు జిల్లాలో 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 6 పాజిటివ్‌ కేసులు నమోదైన తిరుపతితో పాటు, పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, రేణిగుంట, నిండ్ర, వడమాలపేటలోని 7 ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించామని కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా వివరించారు. 3 కిలోమీటర్ల మేర కంటైన్మంట్ క్లస్టర్లు, ఐదు కిలోమీటర్ల మేర బఫర్‌జోన్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు జిల్లాలో 1467 మందిని కరోనా అనుమానితులుగా గుర్తించి నమూనాలు సేకరించగా 945 నమూనాలు నెగిటివ్ గా వచ్చాయని మరో 499 మందికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ట్రూనాట్‌ యంత్రాల ద్వారా... ఇప్పటి వరకు 73 మంది అనుమానితులకు సంబంధించిన నమూనాలను పరీక్షించామని తెలిపారు. అనుమానితుల సంఖ్య పెరగుతున్న పరిస్థితుల్లో... నమూనాల పరీక్ష కోసం జిల్లాలో పదిహేడు ట్రూనాట్‌ పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details