చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధికి... తమిళనాడులోని అంబూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే వచ్చాడు. సమీపంలోని మకాన్ వీధిలో ఉన్న బంధువుల ఇంట్లో వారం పాటుగా ఉంటున్నాడు. అతను అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తెలుసుకుని.. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అతడిని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ట్రూనాట్ యంత్రాలతో పరీక్షించగా.. కరోనా లక్షణాలు కనిపించినట్టు అధికారులు తెలిపారు.
తుది పరీక్ష నిమిత్తం తిరుపతిలోని వైరాలజీ క్లినికల్ ల్యాబ్‌కు అతడి నమూనాలు పంపించారు. అతను ఉన్న ఇంటిని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు. మకాన్ వీధిలో బ్లీచింగ్ చల్లించారు. సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరినీ అనుమతించలేదు. లాక్ డౌన్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.