చిత్తూరు జిల్లాలో శుక్రవారం కొత్తగా 1,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...వైరస్ కారణంగా మరో 16 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 27,676కు చేరుకుంది. మృతుల సంఖ్య 304కు పెరిగింది. జిల్లాలో వెలుగుచూస్తున్న కేసుల్లో అత్యధికంగా తిరుపతి నగరంలోనే ఉన్నాయి. ఫలితంగా అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు ఈ నెల చివరివరకు లాక్డౌన్ పొడిగించారు. వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 17,440 మంది కరోనా మహమ్మారి నుంచి కొలుకోగా 9,932 మంది చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి, మదనపల్లె, నగరి, పుత్తూరు పట్టణాలతో పాటు చిత్తూరు నగరంలోనూ లాక్డౌన్ కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో కరోనా కలవరం..కొత్తగా 1,103 కేసులు
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో అత్యధికంగా శుక్రవారం 1,103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లాలో కరోనా కలవరం