ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు కలెక్టర్ భరత్​ గుప్తాకు కరోనా పాజిటివ్ - కలెక్టర్ భరత్​ గుప్తాకు కరోనా పాజిటివ్

చిత్తూరు జిల్లా కలెక్టర్​ గుప్తాకు కరోనా వైరస్​ బారిన పడ్డారు. గురువారం నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్​గా తేలింది. హోం ఐసోలేషన్​కు వెళ్లిన ఆయన... తనను కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

చిత్తూరు కలెక్టర్ భరత్​ గుప్తాకు కరోనా పాజిటివ్
చిత్తూరు కలెక్టర్ భరత్​ గుప్తాకు కరోనా పాజిటివ్

By

Published : Sep 17, 2020, 10:50 PM IST

చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కరోనా బారిన పడ్డారు. గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజటివ్ వచ్చింది. గత వారం రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో భరత్​ గుప్తా పాల్గొన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చిన వెంటనే హోం ఐసోలేషన్​కు వెళ్లిన ఆయన...ఇంట్లోనే చికిత్స తీసుకుంటానని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details