చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. వారం రోజుల ఓ స్థానిక వస్త్ర వ్యాపారి హైద్రాబాద్ కు వెళ్లి వచ్చాడు. అతనికి తీవ్ర జ్వరం రావడంతో కుటుంబీకులు బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.
సమాచారం అందుకున్న స్థానిక వైద్యాధికారులు, పోలీసు అధికారులు బీ. కొత్తకోట పట్టణంలో రెడ్ జోన్ ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు.