చిత్తూరు జిల్లా పుత్తూరు జండామన వీధికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. జూన్ ఒకటో తేదీన గ్రామానికి వచ్చారు. పింఛన్ తీసుకునేందుకు ఆమె నారాయణవనం మండలం పాలమంగళంకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి చెన్నైకి వెళ్లడంతో... అక్కడ ఇంటి యజమాని పరీక్షలు నిర్వహించిన తరువాతే ఇంట్లోకి రావాలని సూచించారు.
పుత్తూరు నుంచి చెన్నై వెళ్లిన మహిళకు కరోనా పాజిటివ్ - పుత్తూరులో కరోనా పాజిటివ్ కేసులు
పుత్తూరుకు చెందిన మహిళ చెన్నైలో నివాసముంటున్నారు. ఆమె జూన్ ఒకటిన పింఛన్ తీసుకునేందుకు పుత్తూరు వచ్చారు. చెన్నై తిరిగి వెళ్లారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు పుత్తూరులో ఆమె సంచరించిన ప్రాంతంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
corona positive
పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆమెను తిరుపతి కోటాసోదికి తరలించారు. అలాగే పుత్తూరు మండలం కైలాసపురంలోనూ ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై నుంచి వచ్చిన వారు చెక్పోస్ట్ వద్ద తప్పించుకొని గ్రామానికి చేరుకున్నారు. వారిద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో వారిని తిరుపతి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :ఆశ్రయం కల్పించినవారే.. అంతమెుందించారు..!