ఈ నెల 13వ తేదీన హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి మధ్య సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తెలింది. ఆ వ్యక్తి ఈ నెల 14న రామగుండంలో దిగినట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా వ్యక్తి ప్రయాణించిన ఎస్-9 బోగిలో ప్రయాణికుల వివరాలను రైల్వేశాఖ అధికారులు సేకరించి, గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఆ బోగిలో విధులు నిర్వహించిన ఇద్దరు టికెట్ కలెక్టర్లను నిర్బంధంలో ఉంచామని, వారిలో కరోనా లక్షణాలు లేవని రేణిగుంట రైల్వే వైద్యులు తెలిపారు. 13వ తేదీ ఆ బోగిలో ప్రయాణించిన వారు 14 రోజులపాటు నిర్బంధంలో ఉండేలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే అధికారులు కోరారు. వైరస్ వ్యాప్తి నియంత్రణపై ముందు జాగ్రత్త చర్యల్లో భాగమేనని అధికారులు తెలిపారు.
సంపర్క్ క్రాంతి ఎస్-9లో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ - ఏపీ కరోనా కేసులు
ఈ నెల 13న హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఎస్-9 బోగిలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. 13వ తేదీ ఎస్-9లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించి గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రయాణికులను నిర్బంధంలో ఉంచేలా సహకరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని రైల్వే అధికారులు కోరారు.
సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఎస్-9 బోగిలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా