ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెనూ పాటించని నిర్వాహకులు... కొవిడ్ బాధితుల ఇబ్బందులు - chithore district corona news

కరోనా వైరస్ సోకిన వారు త్వరగా కోలుకోవడానికి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించాలి. ఇందుకోసం ప్రభుత్వం కొవిడ్ బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తోంది. కాగా... చిత్తూరు జిల్లా మదనపల్లి ఆస్పత్రిలో కరోనా రోగులకు ఆహారం సరిగా అందడం లేదు. ఫలితంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

corona patients problems  in madanapalli chithore district
మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి

By

Published : May 1, 2021, 8:08 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కరోనా బాధితులకు ప్రభుత్వం సూచించిన మోనూ ప్రకారం భోజనం అందడం లేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 లోపు భోజనం పెట్టాలని మెనూలో ఉంటే... సంబంధిత కాంట్రాక్టర్లు మధ్యాహ్నం ఒకటిన్నరకు భోజనం వడ్డిస్తున్నారు.

మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 120 మంది వరకు కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి భోజనం కోసం ప్రభుత్వం రోజుకు ఒక్కొక్కరికీ రూ.300 కేటాయించింది. అయితే ఆస్పత్రిలో భోజనం పరిమాణం తగ్గించి, చాలీచాలని ఆహారం అందిస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బారావు... సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details