చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన మునెమ్మ, ఆమె కోడలికి కరోనా సోకింది. తొండవాడ వద్ద కొవిడ్ కేర్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. మునెమ్మకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గటంతో అక్కడి వైద్యులు తిరుపతికి వెళ్లాలని సూచించారు. అత్తాకోడళ్లు ఆటో కోసం ఎదురుచూస్తుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెమ్మ అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితురాలు మృతి - chithore district crime
కరోనా బారినపడి మహమ్మారితో పోరాడుతూనే.. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. కొవిడ్‌కు చికిత్స తీసుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన బాధితురాలిని కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా అరిగెలవారిపల్లెలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో కరోనా బాధితురాలు మృతి