ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కలవరం... 24 గంటల్లో 25 కేసులు - చిత్తూరు జిల్లాలో కరోనా కలవరం

చిత్తూరు జిల్లాలో కోరనా మహమ్మారి చాప కింద నీరులా వ్యపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి. శ్రీకాళహస్తిలో 12 మంది ఉద్యోగులకు కరోనా సోకడం కలవరపెడుతోంది.

corona in chittor district
చిత్తూరు జిల్లాలో కరోనా కలవరం

By

Published : Apr 21, 2020, 4:43 PM IST

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శ్రీకాళహస్తిలో ఏకంగా 12 మంది ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో శ్రీకాళహస్తిలోనే 34కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా స్క్రీనింగ్‌, ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. లక్ష జనాభా లేని పట్టణంలో మూడు వారాల వ్యవధిలో 34 మందికి కరోనా సంక్రమించడంపై అధికార యంత్రాంగం, వైద్యులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ మైనార్టీలతో పాటు మరో మతానికి చెందినవారు కూడా దిల్లీలో మర్కజ్‌కు వెళ్లినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం తొలుత వెలుగులోకి రాకపోవడంతో కేసుల సంఖ్య పెరిగింది. శ్రీకాళహస్తి క్వారంటైన్‌ను సైతం పలుచోట్లకు మార్చారు. డీటీసీ సెంటర్‌, గంగాసదన్‌, పర్యాటక కేంద్రం, వరదయ్యపాళ్యంలోని ఆధ్యాత్మిక కేంద్రంతో సహా.. తాజాగా ఏర్పేడు మండలం వికృతమాలకు మారుస్తూ వచ్చారు. మార్చినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగులు అనుమానితుల తరలింపు బాధ్యతలు చూశారు. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ, లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. ఆ క్రమంలో పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్​ అయ్యి.. ఉద్యోగులు బాధితులయ్యారన్న అంచనాకు వచ్చారు. వీరికి వ్యాధి లక్షణాలు కన్పించకుండానే పరీక్షల్లో పాజిటివ్‌ రావడం కలవరపెట్టే పరిణామంగా వైద్య నిపుణులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో ఓ రెవెన్యూ అధికారి డ్రైవర్‌కు పాజిటివ్‌ రావడంతో ఆ అధికారిని క్వారంటైన్‌కు తరలించి.. ఇన్‌ఛార్జి బాధ్యతలు బీఎన్‌ కండ్రిగ అధికారికి అప్పగించారు. ఇక్కడ పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను వంద మందికిపైగా తిరుపతిలోని శ్రీపద్మావతి నిలయం క్వారంటైన్‌కు తరలించారు.

ఉన్నతాధికారుల సమీక్ష

కరోనాను నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదకరమని, భయపడకుండా చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని కొవిడ్‌-19 జిల్లా పరిశీలకులు ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా సూచించారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 53 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు డిశ్చార్జి అయ్యారని, 49 యాక్టివ్‌ కేసులున్నాయని కలెక్టర్‌ తెలిపారు.

మూలాల శోధన

దిల్లీ, లండన్‌ నుంచి వచ్చిన వారి ద్వారా వారి సన్నిహితులతో పాటు ఉద్యోగులకు వ్యాపించిందని, వారి నుంచి సెకండరీ కాంటాక్టుగా మెడికల్‌ దుకాణ యజమానులకు విస్తరించిందని ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల బెంగళూరు నుంచి పట్టణానికి వచ్చిన యువకునితో పాటు ఇతరులు ఎవరైనా వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. పాజిటివ్‌ కేసుల్లో 45 ఏళ్లలోపు వాళ్లు ఎక్కువగా ఉన్నారు. పట్టణంలో రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిసరాలు, తహసీల్దార్‌ కార్యాలయం, కొత్తపేట, గోపాలవనం, గాంధీవీధి, నగాచిపాలెం, పాతవరదయ్యపాలెం రోడ్డు, జయరామారావు వీధి, ఎన్టీఆర్‌నగర్‌, శ్రీరాంనగర్‌ కాలనీ, పెద్దమసీదు వీధి, హరహరబావి వీధి, ఇమామ్‌ వీధులన్నీ రెడ్‌జోన్‌ పరిధిలోనికి తెచ్చారు. ఉదయం 9 గంటల తర్వాత బయటకి వచ్చేవారికి జరిమానాలు విధిస్తున్నారు. మే 3 వరకు బ్యాంకులు కూడా మూసేయాలని అధికారులు ఆదేశించారు.

ఇదీ చదవండి:కరోనా వేళ... కేంద్రం కోత

ABOUT THE AUTHOR

...view details