ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: భారీగా ఆదాయం కోల్పొయిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం - నష్టాల బాటలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం

కరోనా కారణంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మూడు నెలలుగా నష్టాల బాటలో నడుస్తోంది. రాష్ట్రంతోపాటు తమిళనాడు,కర్ణాటక, విదేశీ భక్తులతో నిత్యం సందడిగా ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులు లేక వెలవెలబోతోంది.

కరోనా ఎఫెక్ట్: నష్టాల బాటలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం
కరోనా ఎఫెక్ట్: నష్టాల బాటలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం

By

Published : Jul 31, 2020, 10:44 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లా ముక్కంటి ఆలయం మూడు నెలలుగా నష్టాలు బాటలో నడుస్తోంది. కరోనా లాక్​డౌన్ అమలులో ఉండటంతో ఆలయానికి భక్తుల తాకిడి మందగించింది. ఆలయానికి ప్రధాన ఆదాయ మార్గమైన రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు రోజుకు వంద కూడా రాకపోవడంతో పూర్తిస్థాయిలో ఆదాయం తగ్గింది. దర్శనాలకు సైతం వెయ్యి మంది లోబడి వస్తుండటంతో మార్చి నుంచి నేటి వరకు రూ.21 కోట్లు నష్టం వాటిల్లింది. రాష్ట్రంతోపాటు తమిళనాడు,కర్ణాటక, విదేశీ భక్తులతో నిత్యం సందడిగా ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులు లేక వెలవెలబోతుంది.

ABOUT THE AUTHOR

...view details