చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా ప్రభావం పెరుగుతోంది. కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంపై కాస్త ఊపిరి పీల్చుకునే లోపే… మళ్లీ ఒకే రోజు ఏకంగా 15 కేసులు నమోదు కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో విజృంభిస్తున్న కరోనా వైరస్ - Srikalahasti latest news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా విజృంభిస్తోంది. ఒకేరోజు 15 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరిగిన కారణంగా పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
![శ్రీకాళహస్తిలో విజృంభిస్తున్న కరోనా వైరస్ corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7450719-thumbnail-3x2-kalahasti.jpg)
corona
శ్రీకాళహస్తిలోనే కాక.. గ్రామీణ ప్రాంతాలైన ఓబులాయపల్లెలో 9, చటర్జీనగర్ లో ఒక కేసు నమోదయ్యాయి. వీరిలో చెన్నై నుంచి వచ్చిన వారు ఉన్నట్టు అధికారు తెలిపారు. అంతా కలిపి ఒకే రోజు 15 మందికి కరోనా సోకిందన్నారు. స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరోనా వ్యాప్తి నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు.