కరోనా వేళ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన రైతు వెంకన్న రూ.19వేలు రవాణా ఖర్చు భరించి 4టన్నుల పూలను బుధవారం తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్‌కు తీసుకొచ్చారు. శుభకార్యాలు లేక పూలకు డిమాండ్ లేదని వ్యాపారులు చెప్పడంతో.. ఉసూరుమంటూ వాటిని రహదారి పక్కన పారబోశారు.
కరోనా దెబ్బకు... పూల రైతు విలవిల! - corona cases in andhra pradesh
కరోనా ప్రభావంతో పూల రైతులు విలవిల్లాడుతున్నారు. శుభకార్యాలు లేక.. పూలు మార్కెట్ అయ్యే దారిలేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక, ఉపాధి లేక, పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ పూల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు దీనంగా వేడుకుంటున్నారు.
corona effect on flowers farmers..