ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కష్టాలు... వాడిపోతున్న పూలు - పూల తోటలపై కరోనా ప్రభావం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఉద్యాన రైతులు లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంట కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

corona effect on floral crops
పూల తోటలపై కరోనా ఎఫెక్ట్​

By

Published : Mar 28, 2020, 8:22 PM IST

కరోనా కష్టాలు... వాడిపోతున్న పూలు

కరోనా వైరస్ ప్రభావం ఉద్యాన పంటల మీద పడింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఉద్యాన పంటలు ఎక్కువగా ఉంటాయి. అడవి జంతువులకు భయపడి ఎక్కువగా ఉద్యాన పంటలు వేస్తారు. కనకాంబరం, బంతి వంటివి ఎక్కువగా సాగు చేస్తారు. కరోనా వైరస్ కారణంగా ఉద్యాన రైతులు బలవుతున్నారు. లాక్​డౌన్ ప్రకటించడంతో రైతులు విలవిలలాడుతున్నారు. పూలు కోయడానికి కూలీలు దొరకడంలేదు. ఏవో తంటాలు పడి పంట కోసినా కొనేవారు లేరు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details