ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటలు పండినా ప్రయోజనం లేకపాయె! - తంబళ్లపల్లెలో పంటలపై కరోనా ప్రభావం

చాలీ చాలని నీటితో.. అప్పు తెచ్చి మరీ పంట పండిస్తే.. చివరికి కరోనా ప్రభావం.. ఆ పంటలపై కాటు వేసింది. పంట అధికంగా దిగుబడి వచ్చినా మార్కెట్లో అమ్మటానికి వీలు లేకుండా పోయింది. రవాణా వ్యవస్థ, మార్కెట్ మూసివేత వంటి పరిస్థితుల్లో పంటలు పొలాల్లోనే పాడవుతున్నాయి.

తంబళ్లపల్లెలో పంటలపై కరోనా ప్రభావం
తంబళ్లపల్లెలో పంటలపై కరోనా ప్రభావం

By

Published : Apr 3, 2020, 5:03 PM IST

తంబళ్లపల్లెలో పంటలపై కరోనా ప్రభావం

కష్టపడి పంటలు పండించినా ఇప్పుడు వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల్లో పంటలను అమ్ముకోవడానికి మార్కెట్లు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు ఎక్కువగా దోస, కర్బూజ, సపోటా, మామిడి వంటి రకాలు పండ్లు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో ధరలు ఉన్నప్పటికీ... కరోనా వైరస్ ప్రభావంతో రవాణా, మార్కెట్ వసతులు లేవు. పంట పక్వానికి వచ్చినా... మార్కెట్ కు తరలించడానికి రైతులకు అవకాశం లేకుండా పోతోంది. తోటల్లోనే పండ్లన్నీ మగ్గుతున్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. పండిన పంటలనైనా మార్కెట్లకు తరలించి.. విక్రయించడానికి సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details