చిత్తూరు జిల్లా.. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ మాస్కుల తయారు చేస్తున్నారు. కరోనా బారిన పడకుండా వాటిని అందరికీ పంపిణీ చేస్తున్నారు. నాణ్యమైన మాస్కులను సొంతంగా ఇంటివద్దనే తయారు చేసి విశ్వవిద్యాలయం ద్వారా నిరుపేదలకు అందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సోషల్ విభాగం ప్రిన్సిపల్ కవితా, తులసి ఇంటివద్దనే మాస్క్‌లను తయారు చేశారు. తొలిదశలో మాస్క్ లను కుట్టిన ఆచార్యులు తులసి... తనవంతు సాయంగా శానిటైజర్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
మాస్కులు తయారుచేసి పంపిణీ చేస్తున్న ప్రిన్సిపల్
కరోనా వ్యాప్తి చెందకుండా పలువురు తమకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు. ఆకలి బాధలు తీరుస్తున్న వారు కొందరైతే..తమకు చేతనైన దాంట్లో మాస్కులు తయారు చేసి పంచిపెడుతున్నారు మరికొందరు.
corona effect