ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా కలవరం - చిత్తూరు జిల్లా కరోనా వార్తలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపులతో... విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్ వ్యాప్తి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా విస్తృతి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా కలవరం
తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా కలవరం

By

Published : Jun 23, 2020, 12:05 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లాక్ డౌన్ ప్రారంభం నుంచి నిబంధనలు పాటిస్తూ కరోనా విస్తరించకుండా స్థానికులు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ విదేశాల నుంచి వచ్చిన వారు, పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వలస కూలీలు, కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన వారి వల్ల నియోజకవర్గంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయని స్థానికులు అంటున్నారు.

నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో తొమ్మిది కరోనా కేసులు నమోదు కాగా, ములకలచెరువు మండలంలో 3, పెద్దమండ్యం మండలంలో 3, కురబలకోట మండలం ముదివేడులో ఒకటి.. పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముదివేడులో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి :నాపై కోపంతో... నా సన్నిహితులను ఇబ్బందిపెడతారా..?: గంటా

ABOUT THE AUTHOR

...view details