చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో 758 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,334కు చేరింది. మంగళవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో అధిక కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తున్నారు.
తిరుమల బైపాస్ రోడ్లో మాత్రం లాక్డౌన్కు మినహాయింపు ఇచ్చారు. అక్కడ యథావిధిగా వాహనాలను అనుమతిస్తున్నారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకూ 10,945 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 7,200 యాక్టివ్ కేసులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.