చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా - corona latest updates chittoor
చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో చిత్తూరు రెండవ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 22,748 కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 225కు చేరింది.
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన జిల్లాలో చిత్తూరు రెండవ స్థానంలో నిలిచింది. శనివారం ఏకంగా 959 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 22,748 కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 225 కు చేరింది. తిరుపతిలో అత్యధిక కేసులు నమోదవుతుండగా నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 13,371 మందికి కరోనా మహమ్మరి నుంచి కోలుకోగా 8,882 మంది చికిత్స పొందుతున్నారు. శ్రీకాళహస్తి, మదనపల్లె, నగరి, పుత్తూరు పట్టణాలతో పాటు చిత్తూరు నగరంలో లాక్డౌన్ కొనసాగుతుంది.