చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒకే రోజు ఏకంగా 26 కేసులు నమోదు కావటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మొదటినుంచి శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఇటీవల కాలంలో కాస్త తగ్గు ముఖంపట్టాయి. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి... పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
శ్రీకాళహస్తిలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు - శ్రీకాళహస్తిలో కరోనా కేసులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా కేసులు ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటివరకూ రోజుకు రెండు మూడు కేసులు నమోదుతో వైరస్ ప్రభావం తగ్గింది అనుకుంటున్న ప్రజలకు ఒకేరోజు 26 పాజిటివ్ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది.
corona cases in srikalahasthi increasing more number of cases registerdon yesterday